నీ బలమును బట్టి అతిశయించెదా నా యేసయ్య
Nee Balamunu Batti Athishayinchedaa Naa Yeesayya
నీ బలమును బట్టి అతిశయించెదా నా యేసయ్య నీ రక్షణ బట్టి నిను కీర్తించెద - నా యేసయ్య మోసగాళ్ళను మార్చేసినావే - స్తోత్రము స్తోత్రము వంచకులను వంచేసి నావే - స్తోత్రము స్తోత్రము కఠినమైన హృదయముగల నన్ను కరుణ శీలిగా - మార్చేసినావే ||నీ బలమును||
పాపులెందరినో ప్రేమించినావే - స్తోత్రము స్తోత్రము పతితులెందరినో పరిశుద్ధపరచావే - స్తోత్రము స్తోత్రము ఓటమి ఓడిలో - ఒరిగిన ఎందరినో గెలుపు బాటలో - నడిపించినావే ||నీ బలమును||
చెరపట్టబడిన నన్ను విడిపించినావే - స్తోత్రము స్తోత్రము అద్భుతముగా నడిపించినావే - స్తోత్రము సోత్రము లోబడనొల్లక - విసిగించిన నన్ను ఓర్చుకన్న ప్రియ తండ్రివి ||నీ బలమును||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.