TG-556
Telugu

నే బీద చిన్న పిల్లను

nee beeda chinna pillanu

207
views
పల్లవి

నే బీద చిన్న పిల్లను నా బుద్ధి స్వల్ప మయినది నా దివ్య యేసు కొఱకు నే నేమి చేయగలను?

1వ చరణం

నిత్యంబుఁ చిన్న పనులు నే చాలఁ జేయవచ్చును నా చిన్న తప్పు లన్నియు నే చక్క పెట్టవచ్చును. ||నే బీద||

2వ చరణం

మనస్సునందు కోపము వేమాఱు పుట్టునప్పుడు నా కన్ను లెఱ్ఱఁ జేయక నే నోర్చు కొనవచ్చును. ||నే బీద||

3వ చరణం

నే తిన్నగాను నడ్చుచు ఇల్లంత వెలిఁగించుచు నా యేసుకై యుల్లాసముఁ బుట్టింపవచ్చు నెప్పుడు ||నే బీద||

4వ చరణం

నే నెంత చిన్న పిల్లను నా కుండు చిన్న బాధకు నే తాలి ప్రేమ స్తోత్రము లర్పించుచుండఁగలను. ||నే బీద||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.