TG-5346
Telugu

నే బోధింప జనాళికిన్ నేర్పింపు నాకు

Nee Boodhinpa Janaallikin Neerpinpu Naaku

0
views
పల్లవి

1.  నే బోధింప జనాళికిన్ - నేర్పింపు నాకు నో ప్రభు నన్ వెద్కినట్లు నేనును - నశించువారిన్ వెద్కెదను 2.  ఆత్మీయ భోజనంబుతో - పోషించునట్లు నన్నును మూర్ఛిల్లువారికిన్నదే - నేనియ్యగాను నడ్పుమా 3.  కష్టంబులొందు వారిని రక్షింప గల్గునట్లుగా నాకిమ్ము నీదు శక్తిని - నన్ ధైర్య పర్చుమో ప్రభూ 4.  నే నేర్పునట్లు నాకును - నీ దివ్య వాక్యం నేర్పుము ఆలించునట్లనేకులు - నా బోధను దీవింపుమా 5.  ప్రయాసమొందు వారికి - విశ్రాంతి కల్గునట్లుగా ఓదార్చు శక్తి మెండుగా - నీ యాత్మచే నాకిమ్మయా 6.  నీ దివ్యమోము జూచుచున్ నీ హాయి సంతోషంబులు నే నొందుదాక నన్నిలన్ - నీ చిత్తమార నడ్పుమా