♪♫
TG-5347
Telugu
నే బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృప
Nee Brathiki Unnaanantee Adi Keevalan Nee Krupa
0
views
పల్లవి
నే బ్రతికి ఉన్నానంటే – అది కేవలం నీ కృప ఈ స్థితిలో ఉన్నానంటే – అది క్రీస్తు మహా కృప (2) నీ ప్రేమ బలమైనది నీ మాట విలువైనది (2) ||నే బ్రతికి||
1వ చరణం
లోకములో నేనుండగా నీ కరములు చాపి పిలిచావయ్యా దుఃఖములో నేనుండగా నన్ను ఓదార్చినావు నా యేసయ్యా (2) నా ఆధారము నీవే నా ఆశ్రయము నీవే (2) ||నే బ్రతికి||
2వ చరణం
నా వారలే నన్ను నిందించినా నా బంధువులే నన్ను వెలివేసినా (4) ఎవరున్నా లేకున్ననూ నీ తోడు చాలునయ్యా ఏమున్నా లేకున్ననూ నీ కృపయే చాలునయ్యా ||నే బ్రతికి||
3వ చరణం
నా స్థితి నీవు చూసావయ్యా నా గతినే నీవు మార్చావయ్యా (2) నా ఆధారము నీవే నా ఆశ్రయము నీవే (2) ||నే బ్రతికి||