TG-3852
Telugu

నీ చల్లనైన నీడలో నన్

Nee Challanaina Needalo

19
views
పల్లవి

నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ ప్రభు నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీ ప్రభు (2) నీ ప్రేమా నా లోనా (2) ప్రతిక్షణం అనుభవించనీ (2) ||నీ చల్లనైన||

1వ చరణం

మట్టి వంటిది నా జీవితం గాలి పొట్టు వంటిది నా ఆయుషు (2) పదిలముగా నను పట్టుకొని (2) మార్చుకుంటివా నీ పోలికలో (2) మరణ భయమిక లేదంటివి (2) ||నీ చల్లనైన||

2వ చరణం

మారా వంటిది నా జీవితం ఎంతో మదురమైనది నీ వాక్యం (2) హృదయములో నీ ప్రేమా (2) కుమ్మరించుమా జుంటి తేనెలా (2) (ఆహా) మధురం మధురం నా జీవితం (2) ||నీ చల్లనైన||

3వ చరణం

అల్పమైనది నా జీవితం ఎంతో ఘనమైది నీ పిలుపు (2) నీ సేవలో నే సాగుటకు (2) నను నింపుమా నీ ఆత్మ శక్తి తో (2) నే ఆగక సాగెద నీ సేవలో (2) ||నీ చల్లనైన||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.