TG-3853
Telugu

నీ చల్లని నీడలో

Nee Challani Needalo

24
views
పల్లవి

నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో (2) నా బ్రతుకు సాగనిమ్మయ్యా యేసయ్యా – నా బ్రతుకు సాగనిమ్మయ్యా (2) ||నీ చల్లని||

1వ చరణం

కష్టాలు ఎన్ని వచ్చినా వేదనలు ఎదురైనా (2) నీ కృప నాకు చాలు నీ కాపుదల మేలు నీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా (2) ||నీ చల్లని||

2వ చరణం

ఏర్పరచబడిన వంశములో రాజులైన యాజకులుగా చేసితివి (2) పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా నీ కొరకే జీవించుట నాకు భాగ్యము (2) ||నీ చల్లని||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.