నీ చరణములే నమ్మితి
Nee Charanamule Nammithi
నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి (2) ||నీ చరణములే||
దిక్కిక నీవే చక్కగ రావే (2) మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు ||నీ చరణములే||
ఐహిక సుఖము – నరసితి నిత్యము (2) ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని ||నీ చరణములే||
న్యాయము గాని – నా క్రియలన్ని (2) రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు ||నీ చరణములే||
భావము మార్చి – నావెత దీర్చి (2) దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే ||నీ చరణములే||
చంచల బుద్ధి – వంచన యెద్ది (2) ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే ||నీ చరణములే||
చుర్రుకొని యున్న – శోధనలున్న (2) పట్టు విడ గొట్టవే కొట్టవే కొట్టవే ||నీ చరణములే||
నాచు పిశాచి – నరుకుట గాచి (2) కాచుకో దాచవే దాచవే దాచవే ||నీ చరణములే||
యేసుని తోడ – నెవ్వరు సాటి (2) దోసము బాపును బాపును బాపును ||నీ చరణములే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.