నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితిఁ బట్టితిఁ బట్టితి ||నీ చరణములే||
దిక్కిఁక నీవే చక్కఁగ రావే మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు ||నీ చరణములే||
ఐహిక సుఖము నరసితి నిత్యము ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని ||నీ చరణములే||
న్యాయము గాని నా క్రియ లన్ని రోయుచుఁ ద్రోయకు త్రోయకు త్రోయకు ||నీ చరణములే||
భావము మార్చి నావెతఁ దీర్చి దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే ||నీ చరణములే||
చంచల బుద్ధి వంచన యెద్ది ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే ||నీ చరణములే||
చుట్టుకొని యున్న శోధన లున్నఁ పట్టు విడఁ గొట్టవే కొట్టవే కొట్టవే ||నీ చరణములే||
నాచు పిశాచి నరుకుట గాచి కాచుకో దాఁచవే దాఁచవే దాఁచవే ||నీ చరణములే||
యేసుని తోడ నెన్వరు సాటి దోసముఁ బాపును బాపును బాపును ||నీ చరణములే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.