TG-3386
Telugu

నీ చేతి కార్యము - నాలోన జరిగించు

nee cheeti kaaryamu - naaloona jariginchu

Pranam Kamlakharజాషువు షైక్ · Joshua Shaikఅక్షయ ప్రవీణ్ · Akshaya Praveen
1
views
Chorus

నీ చేతి కార్యము - నాలోన జరిగించు నీ దివ్య చిత్తము - నాలోన నెరవేర్చు (2) నీ సన్నిధానము - నిత్యము కనపరచు (2) నీ వాగ్దానము - నాలోన స్థిరపరచు

పల్లవి పూర్వ భాగం

యేసయ్య యేసయ్య - నా బలం నీవయా ఏ భయం లేదయా - నీ కృప చాలయా (2) ||నీ చేతి కార్యము||

మధ్య విరామం

ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన

1వ చరణం

నీ దుడ్డు కర్రయు - నీ దివ్య హస్తము నన్నాదరించును - నన్ను నడిపించును (2) నా మంచి కాపరీ - నీ కరుణ కాంతితో నా జీవితాంతము - వెలిగించుము ||యేసయ్య||

2వ చరణం

నా శత్రు సైన్యమే - నను చుట్టుముట్టినా నీ జాలి హృదయమే - నన్ను విడిపించును (2) కన్నీటి ప్రార్ధనే - నాకున్న ఆయుధం నా జయము నీవనీ - స్తుతియింతును ||యేసయ్య||

3వ చరణం

ఉన్నత శిఖరముకు - నన్ను నడిపించును ఎత్తైన స్థలములపై - నన్ను నిలబెట్టును (2) నా తోడు నీడగా - నీ వాక్య ధ్యానమే నా బ్రతుకు బాటను - సరిచేయును ||యేసయ్య||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.