నీ చిత్తం బేను నీ

nee chiththam beenu nee

🎵 TG-449💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నీ చిత్తం బేను నీ చిత్తంబే నేను మట్టిని ఓ కుమ్మరీ! నీ కోర్కెదీర నన్ దీర్చుమా నీకు లొంగెదన్ ఓ ప్రభువా ||నీ చిత్తం||

1వ చరణం

నీ మార్గంబేను నీ మార్గంబే నేడు నన్ను పరిశోధించు శుద్ధిజేయుమో యేసూ నన్ను నీ సన్నిధిలో మోకరింతున్ ||నీ చిత్తం||

2వ చరణం

నీ కోర్కె యేసు నీ కోర్కెయే నే గాయంబొంది అలసితిన్ బాగుచేయు నన్ ముట్టిప్రభో నీకే సమస్త శక్తి నొప్పున్ ||నీ చిత్తం||

3వ చరణం

నీ యిష్టంబేను నీ యిష్టంబే నీ యాత్మతోడ నన్ నింపుమా నాయందెల్లరు క్రీస్తుంజూడన్ నీ యాధీనంబు నన్నుంచుకో ||నీ చిత్తం||

4వ చరణం

అప్పుడు నేను నీ రీతిగాన్ తప్పకజేతు నో ప్రభువా ఇప్పుడే నీదు సేవ జేయున్ అప్పగింతు నా సమస్తంబు ||నీ చిత్తం||

Report Error