TG-3861
Telugu

నీ కరుణా కటాక్షములే

Nee Deergha Shaanthame

0
views
పల్లవి

నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము నీ కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము (2) యేసయ్యా… కనిపించరే నీలాగా ప్రేమించే వారెవరు (2) ||నీ దీర్ఘ||

1వ చరణం

కడుపేద స్థితిలోనే కరువే నా బంధువాయెను వయసొచ్చిన తరుణములో వస్త్ర హీనతే కృంగదీసెను (2) (ఏ) ఆధారము కనిపించని నా బ్రతుకులో ఐశ్వర్యవంతుడ నన్నాదుకున్నావు (2) యేసయ్యా… కనిపించరే నీలాగా దీవించే వారెవరు (2) ||నీ దీర్ఘ||

2వ చరణం

ఈ లోక జ్ఞానులలో వెర్రివానిగా ఉంటిని ఎన్నికైన వారిలో వ్యర్థునిగా మిగిలి ఉంటిని (2) తృణీకరింపబడిన నా బ్రతుకును కరుణా సంపన్నుడా నన్నెన్నుకున్నావు (2) యేసయ్యా… కనిపించరే నీలాగా కృప చూపే వారెవరు (2) ||నీ దీర్ఘ||

3వ చరణం

నా ప్రాణము నాలో కృంగివున్న సమయములో జీవము గల నీకై నా ప్రాణము పరితపించెను (2) మధురమైన నీ సహవాసముతో నా జీవ నాథుడా నీ మమతను పంచావు (2) యేసయ్యా… కనిపించరే నీలాంటి జీవము గల దేవుడెవ్వరు(2) ||నీ దీర్ఘ||