నీ జ్ఞాపకం అనేకులన
Nee Gnaapakam Anekulanu
నీ జ్ఞాపకం అనేకులను – ప్రభు వైపుకు త్రిప్పుచుండెనా నీ జ్ఞాపకం ఆత్మీయులకు – క్షేమాభివృద్ధి నిచ్చుఁచుండెనా (2) నీ జ్ఞాపకం నీవు మరణించినా మరణాంతర పరిచర్య చేయునా (2) మరణాంతర పరిచర్య చేయునా ||నీ జ్ఞాపకం||
పేతురన్న జ్ఞాపకం – పశ్చాత్తాప పరిమళం పౌలన్న జ్ఞాపకం – పోరాటపు ప్రోత్సాహం (2) నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా (2) ||నీ జ్ఞాపకం||
బర్నబాన్న జ్ఞాపకం – ఆదరణానందము తిమోతన్న జ్ఞాపకం – విశ్వాస విజయము (2) నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా (2) ||నీ జ్ఞాపకం||
ఫిలిప్పన్న జ్ఞాపకం – సువార్త సునాదము స్తెఫనన్న జ్ఞాపకం – క్రీస్తుని స్వారూప్యము (2) నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా (2) ||నీ జ్ఞాపకం||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.