TG-3864
Telugu

నీ జల్దరు వృక్షప

Nee Jaldaru Vrukshapu

0
views
పల్లవి

నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని (2) బలు రక్కసి వృక్షపు గాయములు (2) ప్రేమా హస్తములతో తాకు ప్రభు (2) ||నీ జల్దరు||

1వ చరణం

నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి (2) నీ శిరము వానకు తడిచినను (2) నను రక్షించుటకు వేచితివి (2) ||నీ జల్దరు||

2వ చరణం

నీ పరిమళ పుష్ప సుగంధములు నా రోత హృదయమును నింపినవి (2) ద్రాక్షా రస ధారల కన్న మరి (2) నీ ప్రేమే ఎంతో అతి మధురం (2) ||నీ జల్దరు||

3వ చరణం

ఓ ప్రియుడా నా అతి సుందరుడా దవళ వర్ణుడా నాకతి ప్రియుడా (2) వ్యసనా క్రాంతుడుగా మార్చబడి (2) నీ సొగసును నాకు నొసగితివి (2) ||నీ జల్దరు||