TG-1404
Telugu

నీ జల్దరు వృక్షపు నీడలలో

nee jaldaru vrukssapu needalaloo

39
views
పల్లవి

నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని (2) బలు రక్కసి వృక్షపు గాయములు ప్రేమా హస్తములతో తాకు ప్రభు (2) ||నీ||

1వ చరణం

నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి నీ శిరము వానకు తడిచినను నను రక్షించుటకు వేచితివి (2) ||నీ||

2వ చరణం

నీ పరిమళ పుష్ప సుగంధములు నా రోత హృదయమును నింపినవి ద్రాక్షా రస ధారల కన్న మరి నీ ప్రేమే ఎంతో అతి మధురం (2) ||నీ||

3వ చరణం

ఓ ప్రియుడా నా అతి సుందరుడా దవళ వర్ణుడా నాకతి ప్రియుడా వ్యసనా క్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి (2) ||నీ||