నీ జీవిత పయనం ఎటువైపు సాగిందో
nee jeevita payanam etuvaipu saagindoo
నీ జీవిత పయనం ఎటువైపు సాగిందో ఒకసారి గమనించుకో నీ జీవిత గమ్యం ఏమై ఉందో ఒకసారి యోచించుకో
నిరీక్షణే లేక జీవించుచున్నావా ఆదరణే లేక తల్లడిల్లుచున్నావా యేసుని చాటున నీవు కొనసాగిన ఆయన రక్షణ నిన్ను నిలువబెట్టును
ఆకర్షించే లోకం ఎంతో ఆలరించినా నిజమైన ఆనందం దొరకునా ఎన్ని చోట్ల తిరిగినా ఎంత నీవు వెదకినా నీకు సమాధానమే లభించునా అనిత్యమైన వాటిలో ఆనందం లేదన తెలుసుకున్నావా అంతా శూన్యమని సమస్తము వ్యర్థమని ఎరుగకున్నావా
క్షణకాలపు చెలిమి ఎంతో మురిపించినా నిజమైన ప్రేమ నీకు తెలియునా తెగిపోయే బంధాలు ఎంతో భ్రమపరిచినా తాత్కాలికమేనని గ్రహించవా ఇహలోక స్నేహము దేవునితో వైరమని మరచియున్నావా ఏదియు ఆశించక ప్రాణమిచ్చిన యేసు ప్రేమ ఎరుగకున్నావా
నీవే గొప్ప అని ఎంతో గర్వించినా నీ ఆయుష్కాలమెంతో తెలియునా అన్నీయు నీవి అని ఎంత అతిశయించినా ఏవీ నీతో రావు అని గ్రహించవా నీకు నీవే సాటియని వేరెవ్వరు లేరని వెచ్చించుకున్నావా జీవితమే అల్పమని రేపు నేది కాదు అని ఎరుగకున్నావా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
