నీ జీవితం క్షణ భంగురం
nee jeevitham kssanna bhanguram
🎵 TG-2295🌐 Telugu
పల్లవి
నీ జీవితం క్షణ భంగురం గమ్యంబులేని వేదనల వలయం (2) నీ పాప హృదయం తెరువుము ఈ క్షణం దేవుని ప్రేమను రుచి చూడు ఈ క్షణం ||నీ జీవితం||
1వ చరణం
ఏది సత్యం ఏది నిత్యం – ఏది మాన్యం ఏది శూన్యం సరి చూసుకో ఇప్పుడే – సరి చేసుకో ప్రభు యేసు నీ కొరకు బలి ఆయె కల్వరిలో గమనించుమా ప్రియ నేస్తమా (2) ||నీ జీవితం||
2వ చరణం
కష్టాలు ఎన్నైనా నష్టాలు ఎదురైనా నీ సర్వ భారమంతా – యేసు పైన వేయుమా నీ హృదయ భారం తీరును ఈ క్షణం దిగులు పడకుమా ప్రియ నేస్తమా (2) ||నీ జీవితం||