TG-3866
Telugu

నీ జీవితం నీటీ

Nee Jeevitham Neetee

0
views
పల్లవి

నీ జీవితం నీటీ బుడగా వంటిది ఎప్పుడూ ఆగునో మనకూ తెలియదూ (2) నేడే తెలుసుకో నిజమైన దేవుని నిత్య జీవముకై వెంబడించు యేసుని ||నీ జీవితం||

1వ చరణం

ఎన్నాళ్ళూ ఈ వ్యర్ధపు ప్రయాసము మనకై మరణించిన ప్రభుని చూడు (2) ఈ క్షణమే వెదుకూ నీ హృదయముతో (2) మనదగునూ.. ఆయన క్షమా రక్షణ (2) ||నీ జీవితం||

2వ చరణం

ఎన్నాళ్ళు ఈ వ్యర్ధపు ప్రయాణము త్వరగా రానైయున్నాడు ప్రభువూ (2) ఆయనతో పరమునకేగుటకూ (2) నిరీక్షణ గలవారమైయుందుము (2) ||నీ జీవితం||