TG-3867
Telugu

నీ జీవితం విలువైనది

Nee Jeevitham Viluvainadi

22
views
పల్లవి

నీ జీవితం విలువైనది ఏనాడు ఏమరకు శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం ఈనాడే యోచించుమా ఓ నేస్తమా తెలియునా ప్రభు యేసు నిన్ను పిలిచెను నా నేస్తమా తెలిసికో ప్రభు యేసు నీకై మరణించెను ||నీ జీవితం||

1వ చరణం

బలమైన పెను గాలి వీచి అలలెంతో పైపైకి లేచి (2) విలువైన నీ జీవిత నావా తలకిందులై వాలిపోవ వలదు భయము నీకేలా కలదు యేసే నీ తోడు యేసు మరణించి మరి లేచెను నిన్ను ప్రేమించి దరి చేర్చును ||నీ జీవితం||

2వ చరణం

గాఢాంధకారంపు లోయలో వల గాలి వడి సవ్వడిలో (2) నడయాడి నీ జీవిత త్రోవా సుడివడి నీ అడుగు తడబడిన వలదు భయము నీకేలా కలదు యేసే నీ తోడు యేసు మరణించి మరి లేచెను నిన్ను ప్రేమించి దరి చేర్చును ||నీ జీవితం||

3వ చరణం

కనలేని గమ్యంబు కోరి ఎనలేని కష్టాల పాలై (2) మనలేని నీ జీవిత గాథా కలలన్ని కన్నీటి వ్యథలే వలదు భయము నీకేలా కలదు యేసే నీ తోడు యేసు మరణించి మరి లేచెను నిన్ను ప్రేమించి దరి చేర్చును ||నీ జీవితం||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.