నీ జీవితములో
Nee Jeevithamulo
నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడే నీవు ప్రభు యేసుకొరకు నీ హృదయమర్పించవా (2) ||నీ జీవితములో||
నీ తల్లి గర్భాన నీవుండినపుడే నిను చూచే ప్రభు కన్నులు (2) యోచించలేవా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు (2) ||నీ జీవితములో||
నీలోనే తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను (2) హృదయంపు తలుపు తెరువంగ లేవా యేసు ప్రవేశింపను (2) ||నీ జీవితములో||
తన చేతులందు రుధిరంపు ధారల్ స్రవియించే నీకోసమే (2) భరియించె శిక్ష నీకోసమేగా ఒకసారి గమనించావా (2) ||నీ జీవితములో||
ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు యీనాడేగా (2) ఈ చోటనుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా ఈ చోటనుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరీ ||నీ జీవితములో||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.