TG-351
Telugu

నీ కన్న నిఁక వేరే

nee kanna nimka veeree

188
views
పల్లవి

నీ కన్న నిఁక వేరే వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువా నీ కరుణ యను నెనరుచేతను నీదు సత్య సువార్త ద్వార ప్రాకటంబుగ నన్నుఁ బిలిచిన లోక రక్షక నీకు మ్రొక్కెద ||నీ కన్న||

1వ చరణం

నిన్నుఁ దెలియక మున్ను నన్య దైవంబుల ననుసరించిన పాపము లన్ని పెనగొని నాదు హృదయపుఁ గన్ను ఁ గ్రమ్మి ప్రకాశ మియ్యక యున్న నీ విమలాత్మ వరమున నన్ను వెలిగిఁచిన దయానిధి ||నీ కన్న||

2వ చరణం

వదలక నేఁ జేయు తుద లేని పాపము వదలించి ననుఁ బ్రోచితి తుదిదినంబునఁ గలుగు బాధలుఁ దొలఁగ జేయుట నీవ యని నా హృదయమందున నా నిరీక్షణ పదిలపరచిన భక్త పాలక ||నీ కన్న||

3వ చరణం

నీ వాక్యార్థము నాలో నివసింపఁ జేసి నీ సేవకునిగఁ బ్రోవవే నీవె సత్యము నీవె జీవము నీవె మార్గము నీవె ద్వారము నీవు గాకిం కెవరు లేరు కావవే నను యేసునాయక ||నీ కన్న||