TG-3420
Telugu

నీ కరుణ కటాక్షము నాపై ఉంచుము కృపామయా

nee karuna kataakshamu naapai unchumu krupaamayaa

Daniel JohnJesus Chanan Ministriesప్రకాష్ · Prakashబుష్ · Bush
0
views
Chorus

నీ కరుణ కటాక్షము నాపై ఉంచుము కృపామయా నీ వాత్సల్యతనూ నాపై చూపుము కరుణామయా ॥2॥ నీ చల్లని నీడలో నా కుటుంబముండనీ నీ రెక్కల నీడలో నాకాశ్రయముండని నీ వాక్యముతో నా బ్రతుకును మారనీ నీ పరిశుద్ధాత్మతో నిండారుగ నిండనీ

1వ చరణం

మనషే నీ యెదుట పాపము చేయగా బబులోను రాజుకు నీవు అప్పగించినావే బహుగా నీ యెదుట తగ్గించుకొనెను గుణమొంది యూదులను నీవైపు త్రిప్పెను ప్రేమనొంది నన్ను నేనే సరిచేసుకొందును

2వ చరణం

ఐదు మంది పురుషులతో వ్యభిచారముచేయుచూ విలువలేని జీవితము జీవించుచుండగా నిత్యజీవ మార్గమును బోధించినావే ఆమె ద్వారా ఎంతో మందిని రక్షించినావే (నీ) సువార్తకై నన్ను నేను లోబరచుకొందును

3వ చరణం

అననియా సప్పీరా పాలమమ్మిన ధనములో కొంతదాచి దేవునితో అబద్ధములాడిరి దైవజనుని గద్దింపును నిర్లక్ష్య పెట్టిరి ఒకేరోజు భార్యాభర్త సమాధినొందిరి (నే) నమ్మకముగా నీదు భాగము అర్పించుకొందును

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.