TG-5349
Telugu

నే మారిపోయినా నీవు మారనన్నావు నా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు

Nee Maaripooyinaa Neevu Maaranannaavu Naa Preema Maarinaa Nee Preema Maaradu

19
views
పల్లవి

నే మారిపోయినా నీ వు మారనన్నావు నా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు (2) ఇదియేమి బంధమో నీ ప్రేమ అనుభందం (2) వర్ణంచలేను నీ ప్రేమను వివరించలేను నీ ప్రేమను ||నే మారి||

1వ చరణం

నేనెంత వద్దన్నా  నావెంట పడ్డావు వెంటాడి వెంటాడి నీవైపు తిప్పావు (2) నేను మాట్లాడకున్నా నాతోనే మాటాడి (2) నా మదిని గెలిచావు నా దైవమైనావు (2) ||నే||

2వ చరణం

నాలో యేమిలేకున్నా యేరికోరుకున్నావు నేనేమి కాకున్నా నా ప్రాణమన్నావు (2) నేను నిన్ను యెరుగకున్నా నీవు నన్ను యెరిగావు (2) నా హ్రుదిలొ నిలిచావు నా తండ్రివైనావు (2) నేనేమి అడగకున్నా నాకన్ని యిచ్చావు ఆశ్చర్యకార్యములెన్నో నాపట్ల చేశావు (2) ఊహంచలేనంత ఉన్నతముగ ఉంచావు (2) నన్ను నీకొరకే అర్పించుకొందును (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.