TG-5282
Telugu

నీ నామస్మరణ పూజనీయము యేసయ్య నీ ప్రేమకై నేను ప్రాణమిచ్చెదన్

Nee Naamasmarana Poojaneeyamu Yeesayya Nee Preemakai Neenu Praanamichchedan

20
views
పల్లవి

నీ నామస్మరణ పూజనీయము యేసయ్య నీ ప్రేమకై నేను ప్రాణమిచ్చెదన్ (2) మరువను మరువను మరువనయ నీ నామమును విడువను విడువను విడువనయా నీ స్నేహమును (2) ||నీ||

1వ చరణం

ఎంతటి గనులైనా వణుకుతూ పలికిన నామం విశ్వాస వీరులంతా ప్రార్ధించి గెలిచిన నామం చర్మపు పొరలు ఒలిచినా శిరస్సును ఖండించినా (2) మరువను యేసునామము విడువను ఆయన స్నేహం (2) మరువను మరువను మరువనయ నీ నామమును విడువను విడువను విడువనయా నీ స్నేహమును (2) ||నీ||

2వ చరణం

పాపపు నా బ్రతుకును శుద్ధిగా చేసిన నామం పలుమార్లు  పడిపోయిన క్షమియించి నిలిపిన నామం (2) సాతాను శోధించినా సిలువపై  నన్నుంచినా (2) మరువను యేసు నామము విడువను అయన స్నేహం మరువను మరువను మరువనయ నీ నామమును విడువను విడువను విడువనయా నీ స్నేహమును మరువనయా ఆ.. ఆ.. విడువనయా ఆ.. ఆ.. ||నీ నామస్మరణ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.