TG-3883
Telugu

నీ నిర్ణయ

Nee Nirnayam

0
views
పల్లవి

నీ నిర్ణయం ఎంతో విలువైనది ఈ లోకంలో అది నిర్దేశించును జీవిత గమ్యమును ఈనాడే యేసుని చెంతకు చేరు (2) ||నీ నిర్ణయం||

1వ చరణం

లోకం దాని ఆశలు గతించిపోవును మన్నైన నీ దేహం మరల మన్నై పోవును (2) మారుమనస్సు పొందినచో పరలోకం పొందెదవు క్షయమైన నీ దేహం అక్షయముగా మారును (2) ||నీ నిర్ణయం||

2వ చరణం

పాపం దాని ఫలము నిత్య నరకాగ్నియే శాపంతో నీవుండిన తప్పదు మరణము (2) భరియించె నీ శిక్ష సిలువలో ఆ ప్రభు యేసే ఈనాడే యోచించి ప్రభు యేసుని నమ్ముకో (2) ||నీ నిర్ణయం||