♪♫
TG-3884
Telugu
నీ పాదాలే నాకు
Nee Paadaale Naaku
0
views
పల్లవి
నీ పాదాలే నాకు శరణం యేసయ్యా నీవే ఆధారము (2) నా ఆశ్రయ పురము – ఎత్తైన కోటవి నీవేనయ్యా (2) నా దాగు చాటు నీవే యేసయ్యా (2) ||నీ పాదాలే||
1వ చరణం
అలసిన సమయములో ఆశ్రయించితి నీ పాద సన్నిధి (2) నా ఆశ్రయుడా నీ కన్నా నాకు కనిపించదు వేరొక ఆశ్రయము (2) కనిపించదు వేరొక ఆశ్రయము శరణం శరణం శరణం నీవే శరణం యేసయ్యా (2) ||నీ పాదాలే||
2వ చరణం
ఇరుకు ఇబ్బందులలో చూచుచుంటిని నీ వైపు నేను (2) నా పోషకుడా నీ కన్న నాకు కనిపించరే వేరొక పోషకుడు (2) కనిపించరే వేరొక పోషకుడు శరణం శరణం శరణం నీవే శరణం యేసయ్యా (2) ||నీ పాదాలే||
3వ చరణం
సాతాను శోధనలో పరుగెత్తితిని నీ వాక్కు కొరకు (2) నా జయశీలుడా నీకన్న నాకు కనిపించరే జయమును ఇచ్చే వేరొకరు (2) కనిపించరే జయమునిచ్చే వేరొకరు శరణం శరణం శరణం నీవే శరణం యేసయ్యా (2) ||నీ పాదాలే||