♪♫
TG-5342
Telugu
నే పడిపోతిని నీ ప్రేమకు ఇలలో
Nee Padipoothini Nee Preemaku Ilaloo
24
views
పల్లవి
నే పడిపోతిని నీ ప్రేమకు ఇలలో మైమరచితిని నా మదిని దేవా నా ప్రతికూలతలో నా చెయ్యిపట్టి నన్నాధరించి నడిపించితివే 1. ఈ లోక స్నేహముతో నేను కలిసి రక్షణ జీవితం విడచితినే మేలులెన్నో పొందిన క్షణమే సత్యాన్ని విడచి నడిచితినే నీ రక్తముతో నను కడిగితివే నీ సహనముతో నను నడిపితివే 2. నా పాప భారమంత నీవు భరియించి ఆ సిలువ భారము మోసితివే నా ప్రాణమునకు నీ ప్రాణము బలియిచ్చి ఎనలేని ప్రేమను చూపితివే శుద్ధుడవు పరిశుద్ధుడవు శుద్ధాహృదయం నాకు ఇచ్చితివే నే పడిపోతిని నీ ప్రేమకు ఇలలో మైమరచితిని నా మదిని దేవా నా ప్రతికూలతలో నా చెయ్యిపట్టి నన్నాధరించి నడిపించితివే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.