TG-5284
Telugu

నీ పలుకే నీ పిలుపే నన్ను బ్రతికించునది

Nee Palukee Nee Pilupee Nannu Brathikinchunadi

29
views
పల్లవి

నీ పలుకే నీ పిలుపే నన్ను బ్రతికించునది నీ స్వరమే నన్ను జీవింప చేయునది నా యేసు దేవా - నా జీవనాధా నీ కృపయే నాకు చాలయ్య నా ఆపదలలో నా వెంట నుండి నన్ను నడిపించితివి నీ చేయి ఎన్నడు నన్ను విడువదని వాగ్దానం చేసితివి నీ చల్లని నీ మెల్లని స్వరమే చాలయ్య నీ స్వరమే మేలయ్య నీ రెక్కల నీడలో నన్ను దాచి యుంచితివి నా ముదిమిలో కూడా ఎత్తుకుందునని నాకభయమిచ్చితివి నిన్ను విడచి నే బ్రతుక లేను నీ తోడే చాలయ్య నీ తోడే మేలయ్య

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.