నీ పిలుపు వలన నేను నశించిపోలేదు
nee pilupu valana neenu nashinchipooleedu
నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు (2)
నశించుటకు ఎందరో వేచియున్నను నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను ద్రోహము నిందల మధ్యలో నే నడచినను నీ నిర్మల హస్తము నన్ను భరియించెను యజమానుడా నా యజమానుడా…నన్ను పిలచిన యజమానుడా యజమానుడా నా యజమానుడా… నన్ను నడిపించే యజమానుడా (2) ||నీ పిలుపు||
మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను నన్ను వెంటాడి నీ సేవను చేసితివి నా ఆధారమా నా దైవమా పిలిచిన ఈ పిలుపునకు కారణమా (2) ||నీ పిలుపు||
పిలిచిన నీవు నిజమైన వాడవు నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు ఏదేమైనను కొనసాగించితివి నీపై ఆధారపడుటకు అర్హుడవు నిన్ను నమ్మెదను వెంబడింతును చిరకాలము నిన్నే సేవింతును (2) ||నీ పిలుపు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
