నీ ప్రేమ మధురం యేసయ్యా నీ ప్రేమానురాగం నాకు చాలయ్యా
Nee Preema Madhuran Yeesayyaa Nee Preemaanuraagan Naaku Chaalayyaa
నీ ప్రేమ మధురం యేసయ్యా నీ ప్రేమానురాగం నాకు చాలయ్యా (2) నినుపోలి దైవము నాకెవరులేరూ నువులేని క్షణము నే బ్రతుకలేనూ (2) నా తోడు నీడగా నీవుంటే చాలు (2) ||నీ||
మతిలేని నన్నూ శృతిచేసినావు మితిలేని ప్రేమతో పలికించినావు (2) నీవే లేని నేనూ శూన్యం కదా నీవే దేవా నాకు ధైర్యం సదా నా తోడు నీడగా నీవుంటే చాలు (2) ||నీ||
గతిలేని నన్నూ బతికించినావు ఎనలేని దయతో పోషించినావు (2) నీదీ కానిదేదీ సర్వం వృధా నీవే ప్రభూ నాకు గమ్యం తదా నా తోడు నీడగా నీవుంటే చాలు (2) ||నీ||
కానలేని నన్నూ దర్శించినావు చెరగని కృపతో కరుణించినావు (2) లేనే లేదు ఒక క్షణం వ్యదా నీవే నాధా నాకు నిత్యం హోదా నా తోడు నీడగా నీవుంటే చాలు (2) ||నీ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.