TG-2536
Telugu

నీ ప్రేమా నీ కరుణా

nee preemaa nee karunnaa

82
views
పల్లవి

నీ ప్రేమా నీ కరుణా చాలునయ్యా నా జీవితాన మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన చాలయ్య చాలీ దీవెనలు చాలు మేలయ్య మేలు నీ సన్నిధి మేలు (2) గురిలేని నన్ను గుర్తించినావే ఎనలేని ప్రేమను చూపించినావే వెలలేని నాకు విలువిచ్చినావే విలువైన పాత్రగా నను మార్చినావే ||నీ ప్రేమా||

1వ చరణం

చేజారిన నాకై చేచాచినావే చెదరిన నా బ్రతుకును చేరదీసినావే చెరనుండి నన్ను విడిపించినావే చెరగని నీ ప్రేమకు సాక్షిగ మార్చావే నరకపు పొలిమేరలో నను కనుగొన్నావే కల్వరిలో ప్రాణమిచ్చి నను కొన్నావే నీ ప్రేమను ప్రకటింప నను ఎన్నుకొన్నావే నీ కుమారునిగా నను మార్చినావే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.