TG-5288
Telugu

నీ ప్రేమను మించిన ప్రేమే లేదయ్య

Nee Preemanu Minchina Preemee Leedayya

17
views
పల్లవి

నీ ప్రేమను మించిన ప్రేమే లేదయ్య నీ ప్రేమకు సాటి లేనేలేదయ్యా (2) నీ ప్రేమే‌ నాలో చిగురించెను నీ ప్రేమే నాలో ఫలియించెను (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా ప్రేమామయ యేసయ్యా యేసయ్యా యేసయ్యా కరుణామయ ||నీ ప్రేమను||

1వ చరణం

ఈ లోకమే నన్ను ధ్వేషించినను నీ ప్రేమే నన్ను ఆదరించెను నా స్నేహితులే నను మోసగించినా నన్ను విడువక ఎడబాయక నా తోడే నిలిచితివి (2) ||నీ ప్రేమను||

2వ చరణం

ఈ లోకపు ఆశలలో పడిన నన్ను నీ ప్రేమతో నన్ను పిలిచినావయ్య నా పాపమాలిన్యమును కడిగివేసి నీ వారసునిగా నను చేసుకుంటివి (2) ||నీ ప్రేమను||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.