TG-3893
Telugu

నీ ప్రేమకు సాటి

Nee Premaku Saati

0
views
పల్లవి

నీ ప్రేమకు సాటి లేనే లేదు ప్రేమారూపా యేసురాజా (2) నింగియందునా – నేల యందునా పాతాళమందునా – ఎందైన గాని (2) నీకన్నా అధికులు ఎవరు లేనే లేరు ||నీ ప్రేమకు||

1వ చరణం

పాపినైన నా కొరకు – పరలోకం విడచినదెవరు నా పాపముల కొరకై – సిలువలో మరణించినదెవరు (2) క్షమియించి రక్షించిన నా తండ్రి నీవే ||నీ ప్రేమకు||

2వ చరణం

ధరలోని ధన ధాన్యములు – నన్ను వీడినా ఇలలో నా సరివారు – త్రోసివేసినా (2) ఇహమందు పరమందు నా ధనము నీవే ||నీ ప్రేమకు||