TG-3895
Telugu

నీ ప్రేమలో నుండి నన్

Nee Premalo Nundi Nannu

23
views
పల్లవి

నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు (2) శ్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేవు యేసయ్యా యేసయ్యా నిను మరువలేనయ్యా యేసయ్యా యేసయ్యా నిను విడువలేనయ్యా (2) క్షణమైన నువ్వు లేక నే ఉండలేనయ్యా (2) ||నీ ప్రేమలో||

1వ చరణం

జీవించుచున్నది నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు (2) ఏదేమైనా నాకు యేసే కావాలి ఎవరేమన్నా నాకు యేసే కావాలి (2) ||యేసయ్యా||

2వ చరణం

నీ చిత్తం చేయుటకు నాకు ఆనందం నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను (2) ఏమిచ్చినా నీకు స్తోత్రాలే ఏమివ్వక పోయినా వందనాలే (2) ||యేసయ్యా||

3వ చరణం

ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను నీ కోసమే నీ ప్రేమ కోసమే (2) నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైననేమి అది లాభమే (2) ||యేసయ్యా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.