నీ ప్రియ ప్రభుని సేవకై
nee priya prabhuni seevakai
నీ ప్రియ ప్రభుని సేవకై – అర్పించుకో నీవే పవిత్ర ప్రజలైన మీరు – సేవించుడాయననే (2) అంధకార జీవితమునకు – వెలుగు తెచ్చెను తానే ఆ వెలుగు ద్వారానే – నూతన మార్గము కలిగె సజీవ బలిగా నర్పించు – నీ జీవితమాయనకే (2) ||నీ||
తప్పిపోతివి గతమందు – తప్పు దారిని నడిచితివి తన ప్రేమా హస్తమే – నిన్ను కాపాడి తెచ్చెను యెంతైన స్మరియించు నీవు – వింతైన తన ప్రేమన్ (2) ||నీ||
ఓ ప్రియుడా తలచితివా – నీ జన్మమే పాపమని ప్రభువే తన రక్తముతో – నీ పాపము క్షమియించె నీ యుల్లము ఆయన కాలయమే – జ్ఞాపకముంచుకొనుము (2) ||నీ||
యెవరతని సేవించెదరో – ఫలమొందెదరంతమందు ఇతరులకు లేనట్టి – ఆ ఘనతను నీ కిచ్చె కృతజ్ఞుడవై కొనియాడు – ప్రభు పాద సన్నిధిని
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.