నీ రక్త ధారలే

nee raktha dhaaralee

🎵 TG-2934🌐 Telugu
పల్లవి

నీ రక్త ధారలే – మా జీవనాధారాము నీ సిల్వ మార్గమే – మా మోక్ష భాగ్యము ఓ సిల్వ రాజ – క్రీస్తు రాజ నీతి రాజ – యేసు రాజ (2) మాలోన పలికించు జీవన రాగము – నీ ఆర్తనాదములే మాలోన వెలిగించు జీవన జ్యోతులు – నీ సిల్వ రూపమే ||ఓ సిల్వ||

1వ చరణం

మమ్మును నడిపించు పరలోకమునకు – నీ సత్య వాక్యమే పాపపు చీకట్లు పారద్రోలెను – నీ నీతి ప్రభావమే నీ సిలువ మరణము మనుజాళికంత – కలిగించె రక్షణ నీ మరణ విజయము జగమందు వెలుగొందు – క్రైస్తవ విజయమై

Report Error