♪♫
TG-5302
Telugu
నీ సల్లని సూపే ఓ యేసయ్యా
Nee Sallani Soopee Oo Yeesayyaa
21
views
పల్లవి
నీ సల్లని సూపే ఓ యేసయ్యా నా బతుకును మార్చింది మెస్సీయా నీ మెల్లని మాటే ఓ యేసయ్యా నను సేదదీర్చింది మెస్సీయా 1. పశుశాలలో నీ జన్మ యేసయ్యా తగ్గింపు నేర్పింది మెస్సీయా పరిశుద్ధ నీ నడత యేసయ్యా మాదిరి నాకుంచింది మెస్సీయా 2. నీవు కార్చిన రక్తం యేసయ్యా నా పాపం కడిగింది మెస్సీయా నీవు పొందిన మరణం యేసయ్యా నాకు జీవం పోసింది మెస్సీయా 3. నీ దేహపు గాయం యేసయ్యా స్వస్థత కలిగించింది మెస్సీయా నీ కలువరియాగం యేసయ్యా కొత్తజన్మనిచ్చింది మెస్సీయా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.