TG-5295
Telugu

నీ సన్నిధి చేరితిమి ప్రభువా ప్రార్థన వినుమా

Nee Sannidhi Cheerithimi Prabhuvaa Praarthana Vinumaa

0
views
పల్లవి

నీ సన్నిధి చేరితిమి - ప్రభువా ప్రార్థన వినుమా సన్నిధి చేరితిమి ప్రభు నీ సన్నిధి చేరితిమి 1.  భారములతో వచ్చితిమి ప్రభువా - దృధనమ్మికతో వచ్చితిమయ్యా హృదయాలోచన లెరిగినవాడా మా మనవిని వినుమా 2.  ఆత్మతో నీకే మొఱపెట్టితిమి - నీ చిత్త మెరిగి ప్రార్థించితిమి అడుగక మునుపే మొఱ వినువాడా - మా మనవిని వినుమా 3.  మా మధ్యకు రారమ్ము మా ప్రభువా - రక్తముతో మము శుద్ధీకరించుమా శత్రుని శక్తిని బంధించు ప్రభువా - మా మనవిని వినుమా 4.  కాంక్షించితిమి దీవెనలొంద - రక్షించుము ఆత్మలను ప్రభువా నీ పరిశుద్ధులు స్థిరులగునట్లు - మా మనవిని వినుమా