TG-5300
Telugu

నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా

Nee Sannidhiloo Sanpoornamaina Santhooshamu Kaladayaa

20
views
పల్లవి

నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా యేసయ్యా సంతోషము కలదయా నిను విడిచి ఎట్లుండగలనయా నీవు లేకుంటే ఏమైపోదునయా బలహీన సమయాన నీ శక్తితో కార్యాన్ని జరిగించుచున్నావయా భయపడ్డ నన్ను పలకరించుచు బ్రతికించుచున్నావయా యేసయ్యా నీవు నాకుంటే చాలయా అనుమానస్థితిలోన నీ మాటతో సంతృప్తి కలిగించుచున్నావయా తడబడ్డ నాకు సహకరించుచు గెలిపించుచున్నావయా యేసయ్యా నీవు నాకుంటే చాలయా కెరటాల రొద మధ్య నీ ఆజ్ఞతో విశ్రాంతి నెలకొల్పుచున్నావయా శ్రమపడ్డ నాకు ఫలితమిచ్చుచు వెలిగించుచున్నావయా యేసయ్యా నీవు నాకుంటే చాలయా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.