TG-3908
Telugu

నీ సేవలో

Nee Sevalo

0
views
పల్లవి

నీ సేవలో నన్ను తరియించనీ నీ ప్రేమలో నన్ను జీవించనీ ఆధారమా అనురాగమా నిన్నే స్తుతించి కొనియాడెదా నా జీవమా జయగీతమా నిన్నే స్మరించి స్తుతిపాడెదా యేసు నీలో నే సాగెదా 1. జీవితాన సోలిపోయా - చేరదీసి దయచూపవా హోరుగాలి సాగరాన - చేయి చాపి దరిచేర్చవా వేచివున్నా నే ఆశతో - బలము నింపు నీ ఆత్మతో ఏకమై నా తోడుగా - భయము లేదు నీవుండగా ఎదలో భారం మోసినావు - ఎంత ప్రేమ నా యేసయ్య 2. ఈ జగాన నీడ నీవై - కాచినావే కరుణాత్ముడా ఎన్నడైనా వీడలేదే - మార్పులేని మహనీయుడా చేరదీసే నీ స్నేహము - ఎదురుచూసే నా కోసము నీ కృపా నా క్షేమము - మధురమైన సంకల్పము నడిపే నన్ను నీదు కాంతి - ఎల్లవేళ నా యేసయ్య Nee Sev Lo Nannu Tariyinchane Nee Prema Lo Nannu Jeevinchane Aadhaarama Anuraagama, Ninne Stutinchi Koniyaadedaa Naa Jeevama Jayageethama, Ninne Smarinchi Stutipadedaa Yesu Nīlo Ne Sagedaa 1. Jeevitana Solipoya – Cheradeesi Dayachoopavaa Horugaali Sagarana – Cheyi Chaapi Daricheerchavaa Vechivunnaa Ne Aasato – Balamu Nimpu Nī Aatmato Ekamai Naa Todugaa – Bhayamu Ledu Nīvundaga Edalo Bharam Mosinaavu – Entha Prema Naa Yesayya 2. Ee Jagana Needa Neevai – Kaachinaave Karunatmuda Ennadainaa Veedalede – Maarpuleni Mahanīyuda Cheradeese Nī Snehamu – Eduruchuse Na Kosamu Nī Krupa Na Kshemamu – Madhuramaina Sankalpamu Nadipe Nannu Nīdu Kaanti – Ellavelaa Naa Yesayya