♪♫
TG-3350
Telugu
నీ స్నేహం లేకున్న నీవు నాతో రాకున్నా
nee sneeham leekunna neevu naatoo raakunnaa
17
views
Chorus
నీ స్నేహం లేకున్న నీవు నాతో రాకున్నా నేనెలా బ్రతుకగలను యేసయ్యా (2)
పల్లవి పూర్వ భాగం
నీ సన్నిధి నాకు చాలయ్యా నీ పెన్నిధి నాకు మేలయ్యా (2) ||నీ స్నేహం||
Verse 1
ఏ చెలిమి లేని నా చెలిమి కోరితివే ఏ బలము లేని నా బలముగ మారితివే (2) ఆపదలో ఆదుకున్నావు అపవాదిపై జయమునిచ్చావు (2) ||నీ సన్నిధి||
Verse 2
ఏ దారిలేని నా దారివైతివే చేజారిన నాకై నీ చేయిని చాచితివే (2) సహనముతో సారెపై నుంచావు ఘనమైన నీ పాత్రగ మలిచావు (2) ||నీ సన్నిధి||
Verse 3
ఏ ప్రేమ లేని నా ప్రేమను కోరితివే స్వార్థమే లేని నీ ప్రేమను నేర్పితివే (2) ఓటమిలో ఓర్పు నేర్పితివే ఫలములకై వరములిచ్చితివే (2) ||నీ సన్నిధి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
