నీ స్నేహము నను మనిషిని చేసింది
nee sneehamu nanu manishini cheesindi
నీ స్నేహము నను మనిషిని చేసింది నా హృదయముకు ప్రేమించుట నేర్పింది (2) విలువైన రక్తము నా కొరకు ధారపోసి నిలువెల్ల నలిగితివా ఈ ఘోరపాపి కొరకు దోషములన్నీ కడిగి నాలో జీవం నింపివి
ప్రేమమయుడా ,సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, నా యేసయ్య (2) || నీ స్నేహము ||
నా తల మీద ప్రవహించే సంద్రము వంటివి బాల్యము నుండి నే చేసిన పాపపు కార్యములు (2) నా దుష్కార్యములన్నీ నీ వీపువెనక వేసి దీవెనగా చేయుటకు నా పాప మంతటిని మరిచావు ||ప్రేమమయుడా||
సాధ్యము కాని కార్యములు నీ దయతో పొందితిని నీ మేలులు మరచి పశుప్రాయుడనై వీపును చూపితినీ (2) నా అవిధేయతలన్నీ నీ వేలితో చెరిపి నా ఎముకలలో నీ వాక్యము నే అగ్నికణముగా దాచావు ||ప్రేమమయుడా||
మరణము వరకు నీతోనే నే ఉంటానంటినీ స్థిరముగ నిలిచి నీతో ఉండుట కలగా మార్చితిని (2) కుమారుని రక్తముతో హిమమంత తెలుపు చేసి పరిశుద్ధులలో నను చేర్చుటకు సిలువ కిరణమై వెలిగావు ||ప్రేమమయుడా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
