నీ వాక్యమే నన్ను
Nee Vaakyame Nannu
నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను (2) కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా (2) ||నీ వాక్యమే||
జిగటగల ఊభినుండి లేవనెత్తెను సమతలమగు భూమిపై నన్ను నిలిపెను (2) నా పాదములకు దీపమాయెను (2) సత్యమైన మార్గములో నడుపుచుండెను (2) ||నీ వాక్యమే||
శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది (2) అపవాది వేయుచున్న అగ్ని బాణములను (2) ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది (2) ||నీ వాక్యమే||
పాలవంటిది జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహా మధురమైనది (2) మేలిమి బంగారు కన్న మిన్న అయినది (2) రత్న రాసులకన్నా కోరతగినది (2) ||నీ వాక్యమే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.