♪♫
TG-3914
Telugu
నీ వాక్యమే శ్రమ
Nee Vaakyame Shrama
0
views
పల్లవి
నీ వాక్యమే శ్రమ కొలిమిలో నను బ్రతికించుచున్నది (2) నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది (2) ||నీ వాక్యమే||
1వ చరణం
శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము సంతోషమీయని యెడల (2) బహు కాలము క్రితమే నేను – నశియించియుందునయ్యా నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతున్ (2) ప్రభు ||నీ వాక్యమే||
2వ చరణం
నీ శాసనములే ఆలోచన- కర్తలై నన్ను నడుపుట వలన (2) నా శత్రువుల మించిన జ్ఞానము – నాకిలను కలిగెనయ్యా నీ ఆజ్ఞలను నేను తలదాల్తును (2) ప్రభు ||నీ వాక్యమే||
3వ చరణం
వేలాది వెండి బంగారు నాణెముల విస్తార ధన నిధి కన్నా (2) నీ ధర్మశాస్త్రము యెంతో – విలువైన నిధి ప్రభువా నీ ఆజ్ఞలను బట్టి నిను పొగడడం (2) ప్రభు ||నీ వాక్యమే||