TG-3042
Telugu

నీ విశ్వాస్యత ఆకాశమునంటుచున్నది

nee vishvaasyata aakaashamunantuchunnadi

Immi Johnsonపాస్టర్ ప్. జోసెఫ్ · Pastor P. Josephనిస్సి జాన్ · Nissi John
18
views
Chorus

నీ విశ్వాస్యత ఆకాశమునంటుచున్నది సత్య సంధత్వము అంతరిక్ష మంటుచున్నది (2) నీ కృప నాకు చాలునంటివే నీ దయ నన్ను విడువాదంటివే (2)

పల్లవి పూర్వ భాగం

సమస్తమూ నీకు సాధ్యమే ఆమెన్ నీకే ఆరాధన ఎవ్వరునూ వేయలేరులే నీవు తెరచిన ద్వారాములను (2) నీకే ఆరాధన....నీకే ఆరాధన.... (2)

1వ చరణం

నీ కుడి హాస్తము నామీద చాపితివి గొప్ప వాత్సల్యముతో సమకూర్చితివి (2) శత్రు బలమంత నశియింప చేసితివి గొప్ప విజయమునిచ్చి మమ్ము నిలిపితివి (2) ||సమస్తమూ||

2వ చరణం

నీ అపరంజీ పాదములను కన్నీటితో కడిగెదా ప్రేమతో ముద్దాడి సర్వము నర్పించేదా (2) ఉత్తమైమనదానిని నెకోరెద పరిమళ సువాసనగా నెమారెద (2) ||సమస్తమూ||

3వ చరణం

లెక్కింపలేని మేలులేన్నో చేసితివి కృపాక్షేమములను నా వెంట నుంచితివి (2) పక్షిరాజువలే రెక్కలపై నను మోసితివి జ్యోతిర్మయుడగు నాతండ్రిగానే నడిపించితివి (2) ||సమస్తమూ||

4వ చరణం

నా హీనస్థితిని నీవే చూచితివి నీ సన్నిధి నాలోనే నీవుంచితివి (2) నీ మంచితనమంతయు చూచితివి నీ దాసునిగా నీ సొంతము చేసితివి (2) ||సమస్తమూ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.