♪♫
TG-670
Telugu
నే యేసుని వెంబడింతునని నేడేగా
nee yeesuni venbadinthunani needeegaa
202
views
పల్లవి
నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని నే వెను దిరుగన్ వెనుకాడన్ నేడేసుడు పిల్చిన సుదినం ||నే యేసుని||
1వ చరణం
నా ముందు శిలువ నావెనుక లోకాశల్ నాదే దారి నా మనస్సులో ప్రభు నా చుట్టు విరోధుల్ నావారెవరు నా యేసుని మించిన మిత్రుల్ నాకిలలో గానిపించరని ||నే యేసుని||
2వ చరణం
కరువులైనను కలతలైనను కలసిరాని కలిమిలేములు కలవరంబులు కలిగిననూ కదలనింకా కష్టములైనా వదలను నాదు నిశ్చయము ||నే యేసుని||
3వ చరణం
శ్రమయనను బాధలైనను హింసయైన వస్త్రహీనత ఉపద్రవములు ఖడ్గములైన నా యేసుని ప్రేమనుండినను యెడబాపెటివారెవరు ||నే యేసుని||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.