♪♫
TG-3915
Telugu
నీదెంతో కరుణా కరుణామయా
Needentho Karunaa Karunaamayaa
0
views
పల్లవి
నీదెంతో కరుణా కరుణామయా నీదెంతో జాలి నజరేయా (2) మా పాపమంతా గాయాలుగా దాల్చావు నీ మీన పూమాలగా (2) మా కర్మమంతా ఆ సిలువగా మోసేవు తండ్రి నీ మోపున ||నీదెంతో||
1వ చరణం
ప్రభువా మా పాప ప్రక్షాళనముకై వెలపోసినావు నీ రుధిరమే (2) దేవా మా ఆత్మ పరిశుద్ధికై బలి పెట్టినావు నీ ప్రాణమే ||నీదెంతో||