TG-3917
Telugu

నీదు ప్రేమకు హద్దు లేదయా

needu preemaku haddu leedayaa

J K Christopherపాస్టర్ జ్యోతి రాజు · Pastor Jyothi Rajuరాజేష్ · Rajesh
25
views
పల్లవి

నీదు ప్రేమకు హద్దు లేదయా నీదు ప్రేమకు కొలత లేదయా నీదు ప్రేమకు సాటి రారయా.. ఎవ్వరు పొగడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు||

1వ చరణం

తల్లి తండ్రులు చూపలేని ప్రేమ తనయులివ్వని తేటనైన ప్రేమ (2) పేదలకు నిరు పేదలకు విధవలకు అనాథలకు (2) బంధు మిత్రులు చూపలేని ప్రేమా (2) కొనియాడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు||

2వ చరణం

నరులకై నర రూపమైన ప్రేమ పరము చేర్చగ ప్రాణమిచ్చిన ప్రేమ (2) దొంగలకు వ్యభిచారులకును కౄరులకు నర హంతకులకు మనుజులివ్వని మధురమైన ప్రేమా (2) కీర్తించదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.