TG-436
Telugu

నీదు సన్ని ధానమందు ఓ

needu sanni dhaanamandu oo

202
views
పల్లవి

నీదు సన్ని ధానమందు ఓ నా యేసురక్షకా నాదు నాత్మ చేరి యందు నెంత తృప్తి పొందును ఎంత శ్రేష్ఠమైన బోధ నేను నేర్చుకొందును నీతి మార్గమందు నడ్వ నెంత ధైర్య మొందుదున్!

1వ చరణం

లోక ధనాపేక్షయైన నన్ను మోసపుచ్చదు ఇహ దుఃఖబాధ లెన నన్ను భయపర్చవు నా విరోధియైన సాతాన్ నన్ను వెంబడించినన్ నీదు సన్నిధానమందు యేసు నన్ను దాఁగనీ. ||నీదు సన్ని||

2వ చరణం

యేసు శరణంబువల్ల కల్గు మధురంబును నీవు రుచిచూడ వాంఛ నీకుఁ గల్గి యున్నదా? యేసు శరణంబుఁ జొచ్చు మిది నీకు లాభము ఆయన స్వరూప మిట్లు నీకుఁ గూడఁ గల్గును. ||నీదు సన్ని||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.