TG-3919
Telugu

నీకంటె నమ్మదగిన

Neekante Nammadagina

0
views
పల్లవి

నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా (2) మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా ||నీకంటె||

1వ చరణం

కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే (2) బాధించినా స్వస్థపరిచేది నీవే (2) ||నీకంటె||

2వ చరణం

అణచబడిన వేళ నా తలను ఎత్తినావే (2) శిక్షించినా గొప్ప చేసేది నీవే (2) ||నీకంటె||

3వ చరణం

విడువబడిన వేళ నను చేరదీసినావే (2) కోపించినా కరుణ చూపేది నీవే (2) ||నీకంటె||