నీకసాధ్యమైనది ఏదియ
Neekasaadhyamainadi Ediyu
నీకసాధ్యమైనది ఏదియు లేదు సమస్తము సాధ్యము నీకు (2) ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం (2) ||నీకసాధ్యమైనది||
వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం – సాధ్యం బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం – సాధ్యం (2) నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
పాపమునుండి విడిపించుట సాధ్యం – సాధ్యం శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం – సాధ్యం (2) నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం – సాధ్యం నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం – సాధ్యం (2) నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
సర్వ సత్యములో నడిపించుట సాధ్యం – సాధ్యం పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం – సాధ్యం (2) నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||